Pithapuram: గ్రీన్ పిఠాపురం కార్యక్రమానికి అంకురార్పణ
Pithapuram: పిఠాపురాన్ని పచ్చదనంతో నింపేందుకు 'గ్రీన్ పిఠాపురం' కార్యక్రమం ప్రారంభం. హాజరైన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్.
Pithapuram: గ్రీన్ పిఠాపురం కార్యక్రమానికి అంకురార్పణ
పిఠాపురం: "మన పిఠాపురం – మన గ్రీన్ భవిష్యత్తు" అనే నినాదంతో పిఠాపురం నియోజకవర్గాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు , కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ , ఆదేశాల మేరకు గ్రీన్ పిఠాపురం కార్యక్రమానికి పిఠాపురం పట్టణంలోని టిట్కో గృహాల వద్ద ఘనంగా అంకురార్పణ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు , ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ , డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పచ్చని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం "పచ్చని పిఠాపురం" లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫైర్‌మాన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు , ఓదూరి కిషోర్ , పిఠాపురం ఆర్‌డీఓ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్యప్రకాశ్, పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డా. చిక్కాల వరలక్ష్మి,బొజ్జ లోవరాజు, బొజ్జ కుమార్, దేవరపల్లి చినబాబు, ఆగంటి ప్రభాకర్, గరగా బాబీ, కొత్తపల్లి బుజ్జి, వైస్ ఇన్‌చార్జ్ బలిపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.




