Pithapuram: తాడిపత్రిలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం తాడిపత్రిలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. హాజరైన ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ నాగబాబు, జేసీ శివరాం ప్రసాద్.
Pithapuram: తాడిపత్రిలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
పిఠాపురం: ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్,ఎమ్మెల్సీ కొణిదెలనాగబాబు(నాగేంద్రబాబు) విచ్చేశారు.ముందుగా నాగబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉమ్మడి తూర్పు గోదావరి వరి జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ నాయకులు సూరిశెట్టి జయకృష్ణ చేనేత కార్మికులకు చెక్కులు పంపిణీ, ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా చేనేత కార్మికులకు దుస్సాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ నేతన్న చేనేత వస్త్రం కాదని ఒక జీవితమని చేనేత వృత్తిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలని ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు అన్నారు.
పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాస్టింగ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చేనేత వస్త్రాలకి బ్రాండింగ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారని వ్యవసాయం తర్వాత దేశం గర్వపడే ఉత్తి ఏదైనా ఉందంటే అది ఒక చేనేతని అన్నారు.ఈ సందర్భంగా కొణిదెల నాగేంద్రబాబు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.
ఈ కార్యక్రమంలో పైమేన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురు కిషోర్,కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ పాడాపిడి శివరాం ప్రసాద్ మాజీ జెడ్పిటిసి మడికి ప్రసాద్, చక్రం జ్యోతుల శ్రీనివాస్ ,వల్లి,సుబ్బారావు జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో చేనేత కార్మికులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.




