Pithapuram: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వేలాది బైక్‌లతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. యు.కొత్తపల్లి మండలం నుంచి భారీ సంఖ్యలో శ్రేణులు తరలివచ్చాయి.

V. Ramakrishna, Pithapuram
Published on: 2 Sept 2026 4:47 PM IST
Pithapuram
X

Pithapuram: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.....ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించ బడిన బైక్ ర్యాలీకి యు.కొత్తపల్లి మండలం నుంచి భారీ స్పందన లభించింది.

జనసేన పార్టీ యు.కొత్తపల్లి మండల ఇన్‌చార్జ్ రావు అక్షయ్ మరియు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో యండపల్లి జంక్షన్ నుంచి పిఠాపురం వరకు సుమారు 1000 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మండలంలోని అన్ని గ్రామాల ఇన్‌చార్జ్‌లు, బూత్ ఇన్‌చార్జ్‌లు, వార్డు ఇన్‌చార్జ్‌లు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story