Pithapuram: వాకతిప్ప, ఉప్పాడల్లో ఘనంగా 'మెగా పేరెంట్స్ డే'

Pithapuram: పిఠాపురం కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప, ఉప్పాడ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో జనసేన నాయకుడు రావు అక్షయ్ పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 July 2026 5:02 PM IST
Pithapuram
X

Pithapuram: వాకతిప్ప, ఉప్పాడల్లో ఘనంగా 'మెగా పేరెంట్స్ డే'

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వాకతిప్ప, ఉప్పాడ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న రావు అక్షయ్ కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప జెడ్పీ హై స్కూల్, ఉప్పాడ ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి జనసేన పార్టీ మండల ఇంచార్జ్ రావు అక్షయ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మాట్లాడిన ఆయన, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story