Pithapuram: 'దిశ' పత్రిక పేరుతో ఫేక్ న్యూస్.. జనసేన ఇన్చార్జ్ క్లారిటీ
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ అక్షయ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు. '
Pithapuram: 'దిశ' పత్రిక పేరుతో ఫేక్ న్యూస్.. జనసేన ఇన్చార్జ్ క్లారిటీ
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ అక్షయ్ పై దుష్ప్రచారం జరిగింది దీనికి వివరణ ఇస్తూ అక్షయ్ "దిశ" పత్రిక పేరుతో సామాజిక మాధ్యమాల్లో నా పేరుతో ప్రచారంలోకి వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం, తప్పుడు ప్రచారం. నేను ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అందులో ప్రచారంలో ఉన్న విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఈ తప్పుడు ప్రచారంపై వెంటనే స్పందించి, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ దానిని ఖండించిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ ప్రకటననే నా అధికారిక వివరణగా పరిగణించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మకుండా, నా అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
Next Story




