Pithapuram: మూలపేట బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేత!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం మూలపేటలో ఘర్షణలో మరణించిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన ఇంచార్జ్ అక్షయ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున భరోసా.
Pithapuram: మూలపేట బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేత!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం జనసేన ఇంచార్జ్ అక్షయ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. మూలపేట గ్రామానికి చెందిన యువకుడు రాకేష్ దురదృష్టవశాత్తూ ఘర్షణలో మృతి చెందడం ఎంతో బాధాకరం.
పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాము. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చాము.
ఇలాంటి ఘటనలు మళ్లీ మూలపేటలో గానీ, యు. కొత్తపల్లి మండలంలో గానీ జరగకుండా జనసేన పార్టీగా మా వంతు బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తాము.
Next Story




