Pithapuram: మంగళగిరిలో పిఠాపురం జనసేన ప్రత్యేక సమీక్షా సమావేశం
Pithapuram: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంగళగిరిలో పిఠాపురం జనసేన రివ్యూ మీటింగ్. నియోజకవర్గ సమస్యలు, ఇంచార్జ్ నియామకంపై ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి చర్చలు.
Pithapuram: మంగళగిరిలో పిఠాపురం జనసేన ప్రత్యేక సమీక్షా సమావేశం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం....ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈరోజు మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేక ఫీడ్ బ్యాక్/రివ్యూ మీటింగ్ జరిగింది.
ఈ మీటింగ్ లో పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ వరలక్ష్మి , పిఠాపురం మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ వెన్నా జగదీశ్ , గొల్లప్రోలు మండలం జనసేన పార్టీ ఇన్చార్జి జ్యోతుల శ్రీనివాస్ , గొల్లప్రోలు టౌన్ జనసేన పార్టీ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు మరియు యు కొత్తపల్లి జనసేన పార్టీ ఇన్చార్జి రావు అక్షయ్ హాజరయ్యారు.
ఈ మీటింగ్ లో నియోజవర్గ సమస్యలు, రాజకీయ సమస్యలపై సమగ్ర రివ్యూ జరిగినది. ఈ సందర్భంగా ఇన్చార్జిలందరూ తమ సమస్యలను నివేదించారు. గ్రామాలలో, వార్డులలో సమస్యల సత్వర పరిష్కారానికి అధికారుల ఆలసత్వాన్ని నివారించే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. త్వరలోనే నియోజకవర్గ ఇన్చార్జి నియామకం కూడా పూర్తవుతుందని స్పష్టమైన సూచన కూడా చేశారు.




