Pithapuram: గొల్లప్రోలులో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం శివరామన్యంలో కొన్నేళ్లుగా పేరుకుపోయిన డ్రైనేజీ కాలువ సమస్యను టీడీపీ పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు తక్షణమే స్పందించి పరిష్కరించారు.
Pithapuram: గొల్లప్రోలులో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం!
Pithapuram: చెప్పడమే కాదు చేసి చూపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గొల్లప్రోలు పట్టణ టీడీపి అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు మరోసారి నిరూపించారు. గొల్లప్రోలు శివరామన్యం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని కాలువలో కొన్నేళ్లుగా చెత్త పేరుకుపోయి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ సమస్యపై నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
దీనితో విసిగిపోయిన స్థానిక ప్రజలు, తమ సమస్యను కూటమి నాయకుడైన గొల్లప్రోలు పట్టణ టీడీపి అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్య విన్న వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షేత్రస్థాయికి చేరుకున్నారు. డ్రైనేజీ కాలువ దుస్థితిని స్వయంగా పరిశీలించి, తక్షణమే సిబ్బందిని రంగంలోకి దించి కాలువలోని చెత్తను పూర్తిగా తొలగించి, శుభ్రం చేయించారు.
కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్యను క్షణాల్లో పరిష్కరించి, తమకు నరకం నుంచి విముక్తి కలిగించిన గుండ్ర సుబ్బారావుకు శివరామన్యం ప్రాంత ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. "ఎంతోమందికి చెప్పాం.. ఎవరూ రాలేదు. కానీ సుబ్బారావు చెప్పిన వెంటనే స్పందించి పని పూర్తి చేయించారు. ఆయనే నిజమైన ప్రజా నాయకుడు" అంటూ స్థానికులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.




