Pithapuram: పిఠాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

Pithapuram: పిఠాపురం డాక్టర్ ఉమర్ ఆలీషా స్కూల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం. 250 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు, కంటి ఆరోగ్యముపై అవగాహన సదస్సు నిర్వహణ.

V. Ramakrishna, Pithapuram
Published on: 23 July 2026 3:06 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

పిఠాపురం: పిఠాపురం పట్టణం లోని డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఉచిత వైద్య కంటి శిబిరాన్ని గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ శిబిరాన్ని డాక్టర్ ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్షా వైస్ కరస్పాండెంట్ షేక్ అప్షన్ ప్రారంభించారు.

శిబిరంలో 250 మంది బాల బాలికలకు కంటి పరీక్షలు నిర్వహించారు పాఠశాలలో జరిగిన కంటి వైద్య శిబిరంలో విద్యార్థులకు నిర్వహించారు పలువురు వైద్యులు విద్యార్థులకు కంటి వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మంచి ఆరోగ్యపు అలవాటులతో అందత్వమునకు దూరంగా ఉండవచ్చు అని వారు విద్యార్థులకు వివరించారు.

కిరణ్ కంటి ఆసుపత్రి నిర్వహించిన వైద్య సిబ్బంది నాగేశ్వరరావు వెంకటరమణ నాగలక్ష్మి నవ్య దేవి వాళ్లు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 15 మంది విద్యార్థులకు కళ్ళజోళ్ళు వాడాలని సూచించారు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు షాజహాన్ గారు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story