Pithapuram: గొల్లప్రోలులో ఏసీబీ అధికారుల పేరిట వి.ఆర్.ఓకు బురిడీ!

Pithapuram: గొల్లప్రోలులో ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం. వి.ఆర్.ఓ వెంకటపతి నుంచి ఫోన్ పే ద్వారా రూ.1.30 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు.

RAMA KRISHNA, KKD
Published on: 13 Sept 2026 12:16 PM IST
Pithapuram
X

Pithapuram: గొల్లప్రోలులో ఏసీబీ అధికారుల పేరిట వి.ఆర్.ఓకు బురిడీ!

Pithapuram: గొల్లప్రోలు లో రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించిన సైబర్ నేర గాళ్లు. అవినీతి అక్రమాలపై విచారణకు వస్తున్నామంటూ బెదిరించి, కేసు లేకుండా ఉండేందుకు వి.ఆర్.ఓ వెంకట పతిని రూ.2లక్షలు డిమాండ్ చేసారు.

ఏసీబీ అధికారులు అంటూ గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ కు, రెవెన్యూ అధికారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట మున్సిపల్ కమీషనర్ దివిజా సంపతి కి ఫోన్ చేసి మీ ఆఫీస్ లో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అన్ని మాకు తెలుసని బెదిరింపులు.

ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు మీ వద్ధ కచ్చితమైన సమాచారం మీవద్ద ఉంటే వారిపై ఏ విధమైన చర్యలయినా తీసుకోవచ్చని ఘాటుగా సమాధానం చెప్పడంతో రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు. ఎసిబి అదికారులమని గొల్లప్రోలు ఎమ్మార్వో , ఆర్.ఐ, ఎంపిడివో లకు పోన్ చేసి బెదిరించినట్లు సమాచారం.

గొల్లప్రోలు నగర పంచాయితి పరిధి లో ని పెద్దవీది 2 వ సచివాలయంలో పనిచేస్తున్న వెంకట పతి ని ఎ.సి.బి అధికారులమని బెదిరించి రూ. లక్ష 30 వేలు ఫోన్ పే ద్వారా చెల్లింపు చేయించుకున్న సైబర్ మోసగాళ్ళు..

కాసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కేటుగాడు, తన భార్య గొలుసు అమ్మి రూ 1.30 లక్షలు ఫోన్ ఫే ద్వారా చెల్లించినట్లు వాపోతున్న వి.ఆర్.ఓ.. వెంకటపతి.

కేటుగాళ్లు పలువురు అధికారులు నుండి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసినట్లు సమాచారం. మోసపోయానని గ్రహించి పోలీసులకు పిర్యాదు చేసిన వి.ఆర్.ఓ వెంకట పతి. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD