Pithapuram: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు వినతి

Pithapuram: జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా పిఠాపురంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు APWJF, APBJA వినతిపత్రం. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్ మంజూరుకు డిమాండ్.

V. Ramakrishna, Pithapuram
Published on: 31 July 2026 5:14 PM IST
Pithapuram
X

Pithapuram: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు వినతి

పిఠాపురం: జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా పిఠాపురం పాడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపిడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపీబీజేఏ) సంయుక్త ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ప్రధానంగా కోరిన అంశాలు:

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్ర విధానాన్ని అమలు చేయాలి.

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసి, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అక్రిడేషన్ కార్డుల జారీని సరళీకృతం చేయాలి. ప్రతి జిల్లాలో జర్నలిస్టుల భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.

జర్నలిస్టులకు రాయితీపై నివాస స్థలాలు, గృహ నిర్మాణ సౌకర్యాలు కల్పించాలి. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలి. జర్నలిస్టుల పిల్లలకు విద్యా పరంగా ప్రత్యేక రాయితీలు, స్కాలర్‌షిప్‌లు అందించాలి.

పాత్రికేయుల సంక్షేమ నిధిని మరింత బలోపేతం చేసి ఆర్థిక సహాయాన్ని పెంచాలి. జర్నలిస్టుల వృద్ధాప్య పెన్షన్, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఠాపురానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story