Pithapuram: పిఠాపురం పాడా గ్రీవెన్స్‌కు అందిన 117 అర్జీలు

Pithapuram: పిఠాపురం పాడా కార్యాలయంలో మూడో వారం 'ఒక నెల-ఒక గ్రామం' కార్యక్రమం. వివిధ శాఖల నుంచి మొత్తం 117 అర్జీల స్వీకరణ. అధికారులకు పీడీ ఆదేశాలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 July 2026 6:47 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం పాడా గ్రీవెన్స్‌కు అందిన 117 అర్జీలు

పిఠాపురం: "ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు" కార్యక్రమం వరుసగా మూడో వారం శుక్రవారం పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) కార్యాలయంలో నిర్వహించారు. పాడా పీడీ డా. ఎన్.వి. శివ రామ్ ప్రసాద్, ఏపీడీ వసంత మాధవి, డీడీవో పి. వాసుదేవరరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎస్.టి. రాజేశ్వరరావు తదితర అధికారులతో కలిసి పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించారు.

ప్రధానంగా రెవెన్యూ శాఖకు 46, మున్సిపల్ శాఖకు 27, పంచాయతీరాజ్ శాఖకు 13, విద్యాశాఖకు 8, పోలీస్ శాఖకు 8, ఏపీఈపీడీసీఎల్‌కు 3, నీటిపారుదల శాఖకు 3, వ్యవసాయ శాఖకు 2, ఎస్‌జీఎస్‌డబ్ల్యూఎస్‌కు 2, సెర్ప్‌కు 2, గ్రామీణ నీటి సరఫరా శాఖకు 1, ప్రజారోగ్య శాఖకు 1, పట్టు పరిశ్రమ శాఖకు 1 చొప్పున మొత్తం 117 అర్జీలు అందాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపిస్తూ, సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని పాడా పీడీ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పాడా పీడీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో మూడు వారాలుగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారం నిర్వహించిన "ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో 117 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, అర్జీల పరిష్కార నివేదికలను పాడా కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఈ వారం అందిన అర్జీలను వచ్చే శుక్రవారం నాటికి పరిష్కరించాలని పాడా పీడీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story