Kakinada: ఉప్పాడ మృతురాలి కుటుంబానికి అందజేసిన చెక్కు అందజేత!
Kakinada: ఉప్పాడ రోడ్డు ప్రమాద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా; మృతురాలి కుటుంబానికి జనసేన నేతల ఆర్థిక సహాయం.
Kakinada: ఉప్పాడ మృతురాలి కుటుంబానికి అందజేసిన చెక్కు అందజేత!
Kakinada: కొన్ని రోజుల క్రితం ఉప్పాడ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆటోలో వెళుతుండగా సామర్లకోట సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ముగ్గురు మరణించడం జరిగింది. అందులో ఇద్దరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వాళ్ల కుటుంబాలకు చెక్కులు అందజేయడం జరిగింది.
ఈరోజున గిరికిన సింహాద్రి అనే మహిళ కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చెక్ రూపంలో అందించడం జరిగింది.
ఈ చెక్కును పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాడపీడి శివరాం జనసేన పార్టీ మండల ఇంచార్జ్ రావు అక్షయ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు జ్యోతుల శ్రీనివాస్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మండల వైస్ ఇంచార్జ్ దుర్గాప్రసాద్ ఉప్పాడ గ్రామ ఇంచార్జ్ గంట విజయ్ కుమార్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమల ,మాజీ సర్పంచ్ నక్క మణికంఠ గ్రామ ఇన్చార్జిలు పల్లెటి బాపన్న దొర రామిశెట్టి రాంబాబు పీర్ల శివాజీ, వార్డ్,బూత్ ఇన్చార్జులు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.




