Pithapuram: పిఠాపురం ఆర్ఓబీకి ముందడుగు సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన!
Pithapuram: పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పీఎం గతిశక్తి కింద కేంద్రం నిధులు. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ రమణారావు బృందం క్షేత్రస్థాయి పరిశీలన.
Pithapuram: పిఠాపురం ఆర్ఓబీకి ముందడుగు సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన!
Pithapuram: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైల్వై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సాకారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి.ఉప ముఖ్య మంత్రి నిరంతర కృషి ఫలితంగా ప్రాజెక్టు పురోగతి చర్యలు ప్రారంభమయ్యాయి.
శనివారం రైల్వే ఓవర్ బిడ్జి ప్రతిపాదిత స్థలాన్ని విజయవాడ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమణారావు,రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులతో కలసి సంయుక్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు.
బ్రిడ్జి నిర్మాణ స్థలం, అప్రోచ్ రోడ్లు, భూసేకరణ అవసరాలు, యుటిలిటీ మార్పిడి తదితర సాంకేతిక అంశాలను పరిశీలించారు.
పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని కోరుతూ పవన్ కళ్యాణ్ పలు మార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ని కలసి విన్నవించారు.త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన ఇచ్చిన హామీ మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా సాంకేతిక అంశాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది.
ఈ సందర్భంగా రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ రమణారావు మాట్లాడుతూ..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం మేరకు పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని,ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా నిధులు కేంద్రమే సమకూరుస్తుందని తెలిపారు.ప్రాజెక్టు కు సంబంధించి సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని,సంబంధిత అన్ని శాఖలు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనా వ్యయాలు (Estimates)త్వరితగతిన సిద్ధం చేసి రైల్వే శాఖకు అందజేయాల్సిఉందనన్నారు.అన్ని శాఖల నుంచి అంచనాలు అందిన అనంతరం వాటిని సమీకరించి సమగ్ర నివేదిక ను రైల్వే బోర్డుకు పంపించి అవసరమైన పరిపాలనా, సాంకేతిక అనుమతులు పొందేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం తో పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజలకు సురక్షితమైన,వేగవంతమైన రాకపోకలు అందుబాటు లోకి వస్తాయని అన్నారు.
రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ తో పాటు రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) అప్పలరాజు,పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు,నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజనీర్ సంతోష్,అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసన్న, రోడ్లు & భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లోవరాజు,రెవెన్యూ శాఖ అధికారులు ఈ క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు.




