Pithapuram: పిఠాపురంలో ఆక్రమణలపై ‘పాడా’ ఉక్కుపాదం: క్షేత్రస్థాయిలో పిడి పరిశీలన
Pithapuram: పిఠాపురం పాడా (PADA) కార్యాలయంలో అందిన ప్రజా ఫిర్యాదులపై పీడీ ప్రత్యేక దృష్టి సారించారు.
Pithapuram: పిఠాపురంలో ఆక్రమణలపై ‘పాడా’ ఉక్కుపాదం: క్షేత్రస్థాయిలో పిడి పరిశీలన
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం....ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి – ఆక్రమణల సమస్యల పరిష్కారానికి చర్యలు. పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సర్వేయర్లు, రెవెన్యూ మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పిఠాపురం పట్టణం మరియు మండల పరిధిలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో ఆయన సంబంధిత అధికారులకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలను త్వరితగతిన సమర్పించాలని పాడా పీడీ ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయన వెంట మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




