Kakinada: పిఠాపురం: రాయవరం రైతులకు అండగా నిలిచిన ఎన్ఆర్ఐ శశి!

Kakinada: పిఠాపురం నియోజకవర్గం రాయవరం రైతులకు ఎన్ఆర్ఐ శశి అండ; చెరువు కాలువ పూడికతీత పనుల కోసం స్వచ్ఛందంగా రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత.

RAMA KRISHNA, KKD
Published on: 13 Aug 2026 1:19 PM IST
Kakinada
X

Kakinada: పిఠాపురం: రాయవరం రైతులకు అండగా నిలిచిన ఎన్ఆర్ఐ శశి!

Kakinada: పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో రైతులకు ప్రవాసాంధ్రుడు (ఎన్ఆర్ఐ) శశి అండగా నిలిచారు.గ్రామంలోని పంట భూములను పరిశీలించిన స్వయంగా చూసి చలించిపోయారు.పిఠాపురం శాసనసభ్యులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా సాగునీరు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. గ్రామంలోని చెరువులోనీ కాలువలోని పూడిక తీస్తే రైతులకు తగినంత నీరు లభిస్తుందని గుర్తించి, పూడికతీత పనుల కోసం తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 50,000/- అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగానైతే అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారో, అదే స్ఫూర్తితో ఎన్ఆర్ఐ శశి కూడా తమకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఆదుకున్న శశికి గ్రామ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పూడికతీత సేవా కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాసరావు,నేటి సంఘం డైరెక్టర్లు ఎండపల్లి పెంటయ్య,మాదేపల్లి సత్తిబాబు,జనసేన బిసి నాయకులు నక్క బద్రి, మాజీ సర్పంచులు మాదేపల్లి విజయ భాస్కర్ రావు, కన్నీటి జగ్గారావు, మాదేపల్లి వెంకటేశ్వరరావు, అలాగే ప్రముఖులు బెజవాడ గంగయ్య, మాదేపల్లి రాంబాబు మాదేపల్లి వెంకన్నలతో పాటు అధిక సంఖ్యలో రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story