Konaseema: స్టాక్ ఉండి పెట్రోల్ పోయకుంటే బంకులపై కఠిన చర్యలు
Konaseema: కోనసీమ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు.
Konaseema: స్టాక్ ఉండి పెట్రోల్ పోయకుంటే బంకులపై కఠిన చర్యలు
Konaseema: జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. స్టాక్ ఉండి సరఫరా చేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. డాక్టర్..బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన అవసరం లేదని ఎవరూ ప్యానిక్ అవ్వ వద్దని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ మహే ష్ కుమార్ అన్నారు. బుధవారం ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, తహాసిల్దార్లు, పౌరసరఫరాల డీటీలు తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి డీజిల్ సరఫరా స్థితిగతులపై సమీక్షించారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని, తగినన్ని నిల్వలు అందు బాటులో ఉన్నాయన్నారు. రోజువారీగా జిల్లాకు డీజిల్ తీసుకుని వచ్చేలారీలు సంఖ్య పెరగడంతో పాటు డీజిల్ విక్రయాలు సాధారణ స్థితి చేరుకుంటున్నాయన్నారు. ఒక నయారా కంపెనీకి సంబం ధించి ఆయిల్ రవాణా చేసే వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో సరఫరా విషయంలో కొంత జాప్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. డీజిల్ విక్రయాలు సాధారణ స్థితికి
చేరుకుంటున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేదనే ఆందోళనతో వాహనదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో ఫ్యానిక్ కొనుగోలు చేసి విల్వ చేయవద్దని జిల్లా కలెక్టర్ సూచించారు. బంక్ అవుట్ లెట్ల నందు స్టాక్ ఉండి వినియోగదారులకు సరఫరా చేయకుంటే సంబంధిత బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి హెచ్చరించారు. బల్క్ వినియోగం పై దృష్టి పెట్టాలని అక్రమ నిల్వలు చేయడం చట్ట విరుద్ధమని దీనిపై నిఘా ఉంచాలని తహశీల్దార్లకు, పోలీసులకు,
సి ఎస్ డి టి లకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే నిత్యవసర వస్తువుల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డీజిల్ అవసరాలు డిమాండ్ కనుగుణంగా సరఫరాను పునరుద్ధరించాలని ఆయన కంపెనీల ప్రతినిధులకు సూచించారు. చమురు నిల్వలు తక్కువగా ఉన్న బంకులను గుర్తించి వెంటనే సమృద్ధిగా ఆయిల్ సరఫరా చేయాలని ఆదేశించారు మొత్తం 110 బంకులు తెరిచి రెండు రోజులలో సాధారణ పరిస్థితులు పూర్తిస్థాయిలో నెలకొల్పాలని ఆయిల్ కంపెనీల ప్రతి నిధులకు సూచించారు.
దశలవారీగా చమురు నిల్వలను పెంచుతూ డిమాండ్ ను చేరుకోవాలని సూచించారు. నయారా కంపెనీ ప్రతినిధిని జిల్లా కంట్రోల్ రూమ్ లో నియ మించాలని సూచించారు వరి కోతలు, ఆక్వారంగా రేడియేటర్లకు అవసరమైన డీజిల్ సరఫరాకై తహాసిల్దార్ నుండి గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ మత్స్య సహాయకులు ద్వారా కూపన్లను రోజువారీగా ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని వాటిని బంకులలో ఉన్న రెవెన్యూ సిబ్బంది నిశితంగా
పరిశీలించి సరఫరాకై తగు చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. ప్రాధాన్యతగా క్రమంలో మాత్రమే డీజిల్ విక్రయాలు నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు ప్రజా రవాణాకు మొదటి ప్రాధాన్యతను
ఇవ్వాలన్నారు. మండల తహాసిల్దార్లు తెలిపిన బంకులలో చమురు నిల్వలను సమృద్ధిగా ఉంచి ఆయా ప్రాంత అవసరాలకు సరఫరా చేయాలన్నారు. ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు ప్లాన్ అఫ్ యాక్షన్ ప్రకారం అన్ని బంకు లను పునః ప్రారంభించి జిల్లాలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా డీజిల్ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఏ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




