Kakinada: జగ్గంపేట నియోజకవర్గంలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నెహ్రూ

Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ₹1.87 కోట్లతో గోవిందపురం - మల్లవరం మధ్య నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 11 Aug 2026 6:27 PM IST
Kakinada
X

Kakinada: జగ్గంపేట నియోజకవర్గంలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 11: జగ్గంపేట మండలం గోవిందపురం శివారు గోకవరం మండలం మల్లవరం గ్రామాల మధ్య భూపతి పాలెం సమీపంలో కోటి 87 లక్ష రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గ్రామీణ సమృద్ధి యోజన పథకం 3 నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే గోవిందపురం, మల్లవరం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ముఖ్యంగా భూపతిపాలెం గురుకుల పాఠశాల వద్ద కంచి కామకోటి పీఠం వారి ట్రస్టు ఆధ్వర్యంలో కేజీ నుండి పీజీ వరకు ఎడ్యుకేషనల్ హబ్ నిర్మించేందుకు సెప్టెంబర్ మొదటివారంలో ప్రతినిధులు కూడా వస్తున్నారని అన్నారు.

ఏజెన్సీకి దగ్గర ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక వరద తా కిడి కూడా తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఆర్ అండ్ బి, డి ఈ మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చాలా కష్టపడి నిధులు తీసుకువచ్చి బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారంచుట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కన్నబాబు, ఎస్విఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు,పాలచర్ల నాగేంద్ర చౌదరి, దాసరి తమన్న దొర, పిల్లా చంటిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, రేఖ బుల్లి రాజు, పురంశెట్టి శివాజీ, యిడుదల అర్జునరావు, కమ్మిల వెంకటేశ్వరరావు, నాని రాజు, కొల్లు రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story