Razole: రాజోలు రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం.. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
Razole: రాజోలు రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం.. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
రాజోలు: డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం లోని రాజోలు రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రోటరీ క్లబ్ దత్తత గ్రామమైన చెన్నడం గ్రామానికి చెందిన 31 మంది మహిళలకు క్లబ్ సమకూర్చిన కుట్టు మిషన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే మహిళలకు ఈ కుట్టు మిషన్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న అచంట గ్రామానికి చెందిన దినకరన్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.80 వేల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు సోమిశెట్టి ఆంజనేయులు, కార్యదర్శి నామన షణ్ముఖ, జెడ్పీటీసీ సభ్యులు మట్టా శైలజ, గుండుబోగుల పెదకాపు,దార్ల పెదబాబు తదితరులు పాల్గొన్నారు.




