Pithapuram: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 6న పిఠాపురంలో జాబ్ మేళా!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో జూన్ 6న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 3 Jun 2026 7:46 AM IST
Pithapuram
X

Pithapuram: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 6న పిఠాపురంలో జాబ్ మేళా!

Kakinada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) సమన్వయంతో, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి, యువకులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 2026 జూన్ 06వ తేదీన కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పిఠాపురంలో ఉదయం 9.00 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించబడనున్నది.

అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు మరియు అర్హతలకు అనుగుణంగా సుమారు 30 ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.

ఈ జాబ్ మేళాలో SSC నుండి ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చును. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మోబిలైజేషన్ పోస్టర్‌ను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మరియు పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో APSSDC, ఉపాధి శాఖ మరియు PADA పరస్పర సమన్వయంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అర్హత మరియు ఆసక్తి కలిగిన ప్రతి నిరుద్యోగ యువతి, యువకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణమైన ఉద్యోగాలను పొందాలని కోరారు.

అభ్యర్థుల నమోదు కోసం పోస్టర్‌లో ఇవ్వబడిన క్యూ ఆర్ కోడ్ ద్వారా “నైపుణ్యం” పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా సూచించారు. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో విస్తృత ప్రచారం, అభ్యర్థుల మోబిలైజేషన్, సంబంధిత శాఖల సమన్వయం చేపట్టబడుతోందని తెలిపారు.

కావున జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవలసిందిగా కోరడమైనది.

మరిన్ని వివరాల కోసం పోస్టర్‌లో పొందుపరిచిన ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story