Pithapuram: పిఠాపురం విద్యార్థులకు ఉపాధ్యాయురాలి ఉదారత
Pithapuram: పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలి సేవాభావం. రూ. 80 వేల విలువైన యూనిఫామ్స్, లక్ష రూపాయల స్కాలర్‌షిప్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన పిజిటి అనంతలక్ష్మి.
Pithapuram: పిఠాపురం విద్యార్థులకు ఉపాధ్యాయురాలి ఉదారత
పిఠాపురం: పట్టణం శ్రీ బాదం మాధవరావు గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ 2026-27 విద్యాసంవత్సరంలో కుమారి గుళ్లపల్లి అనంతలక్ష్మి సత్యవతి దేవి మాథ్స్ పిజిటి శ్రీ బాదం మాధవరావు గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ లోని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సుమారు 80,000/- రూపాయలు వెచ్చించి రెండు జతల యూనిఫాం ను కొనుగోలు చేసి వాటిని పాఠశాల ప్రిన్సిపాల్ జీ.శ్యాంబాబు మరియు ఎస్ఎంసి.చైర్మన్ ఎస్.విజయలక్ష్మి, వైస్ చైర్మన్ నూకాలు చేతుల మీదుగా విద్యార్థినిలకు అందించడం జరిగింది.
కుమారి గుళ్లపల్లి అనంతలక్ష్మి సత్యవతి దేవి మాట్లాడుతూ నేను ఎంతో పేదరికం నుండి వచ్చానని పేదరికం వలన ఎవరు విద్యకు దూరం కాకూడదని ఉద్దేశంతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని దీనిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ముందుకు వస్తారని ఆశిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జీ.శ్యాంబాబు మాట్లాడుతూ కుమారి గుళ్లపల్లి అనంతలక్ష్మి సత్యవతి దేవి మాథ్స్ పిజిటి ఎంతో సేవా దృక్పథంతో ఆమె కార్యక్రమాలు చేసిందని విద్యార్థులకు యూనిఫామే కాకుండా 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో ఫస్ట్ సెకండ్ వచ్చే విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడానికి అలాగే స్కూలుకు అవసరమైన స్టేజ్ నిర్మాణానికి సుమారు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందని ఇలాంటి కార్యక్రమాలు ఆమె ఎన్నో చేశారని ఇవి మచ్చుతునకలని ఈమెను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది ముందుకు రావడం జరుగుతుందని సెప్టెంబర్ నెలలో ఈమె రిటైర్మెంట్ కూడా అవ్వడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జీ.శ్యాంబాబు,జీ.అనంత లక్ష్మి దేవి,పాఠశాల టీజీటీ లు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.




