Pithapuram: కుక్కుటేశ్వర పుష్కరిణి వద్ద రీల్స్ షూట్.. పోలీసులకు ఫిర్యాదు!
Pithapuram: పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ పుష్కరిణి వద్ద అనుమతి లేకుండా ప్రమోషన్ వీడియో చిత్రీకరించిన వారిపై ఆలయ అధికారులు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Pithapuram: కుక్కుటేశ్వర పుష్కరిణి వద్ద రీల్స్ షూట్.. పోలీసులకు ఫిర్యాదు!
పిఠాపురం: పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పుష్కరిణి వద్ద ఒక రెస్టారెంట్/వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రమోషన్ వీడియో (రీల్) చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయం దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ విషయం తెలిసిన వెంటనే, దేవస్థానం అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయమై సంబంధిత వెబ్సైట్/సోషల్ మీడియా నిర్వాహకులు, వీడియో చిత్రీకరణలో పాల్గొన్న వారు మరియు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో దేవస్థానం తరఫున ది.14.9.2026 న ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ విషయమై అవసరమైన వివరాలు మరియు ఆధారాలను పోలీస్ శాఖకు అందజేయడం జరిగింది. సంబంధిత అంశం ప్రస్తుతం పోలీస్ విచారణలో ఉంది.




