Kothapalli: కొమరగిరి గ్రామంలో జనసేన ఇన్‌చార్జ్ రావు అక్షయ్ పర్యటన

Kothapalli: కొత్తపల్లి మండలం కొమరగిరిలో జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రావు అక్షయ్ పర్యటన. వాకింగ్ ట్రాక్ పనులు, స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన నేతలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 Aug 2026 3:01 PM IST
Kothapalli
X

Kothapalli: కొమరగిరి గ్రామంలో జనసేన ఇన్‌చార్జ్ రావు అక్షయ్ పర్యటన

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ జనసేన నాయకుల ఆహ్వానం మేరకు కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించారు.

అనంతరం మహిళల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కొమరగిరి హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థుల చదువు, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన ఇంచార్జ్ రాసంశెట్టి లోవబాబు , నాయకులు కిరణ్ , దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story