Kothapalli: కొత్తపల్లి మండలంలో పంటల బీమాపై అవగాహన సదస్సు

Kothapalli: కొత్తపల్లి మండలం ఎండపల్లిలో పొలం పిలుస్తోంది, పంటల బీమా అవగాహన సదస్సు. పాల్గొన్న గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ సునీల్ కుమార్.

V. Ramakrishna, Pithapuram
Published on: 4 Aug 2026 10:00 PM IST
Kothapalli
X

Kothapalli: కొత్తపల్లి మండలంలో పంటల బీమాపై అవగాహన సదస్సు

కొత్తపల్లి: పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్,గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ పొలం పిలుస్తోంది మరియు పంట పొలాలకు బీమా అవగాహన కార్యక్రమం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం.

రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి మరియు ఇతర ముఖ్య అంశాలపై అవగాహన కల్పించే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని అన్నారు.

అనంతరం ఆంధ్ర ప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పి4 కార్యక్రమం ద్వారా సత్యవతి అనే ఒక మహిళను దత్తత తీసుకుని ఆమెకు కావాల్సిన నిత్యవసర సరుకులు మరియు మెడిసిన్సు అందించడం జరిగిందన్నారు.కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ ఎల్ నినో తీవ్రత పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా, చాలా బలహీనంగా ప్రవేశించాయి.

దీనివల్ల జూన్, జూలై నెలల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతంలో భారీ లోటు ఏర్పడింది అని దీని వలన పంటలకు భారీ నష్టం ఏర్పడుతుందని దానికోసం పంటలకు బీమా చేయించుకోవాలని సూచించారని అన్నారు.ఈ కార్యక్రమంలో యండపల్లి జనసేన గ్రామ ఇంచార్జ్ ఆ గుండ్ర కిషోర్,జనసేన సీనియర్ నాయకులు గుండ్ర జగ్గారావు, గాది కొండబాబు,యు.కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు,వార్డ్ ఇన్‌చార్జులు, జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story