P Gannavaram: కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి వరద!
P Gannavaram: భద్రాచలంలో గోదావరి వరద తగ్గినప్పటికీ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది.
P Gannavaram: కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి వరద!
P Gannavaram: భద్రాచలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, డాక్టర్ BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది. సీసీ రోడ్లపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు శివారు కొర్లగుంట నుంచి అప్పనపల్లి మొల్లేటి వారి పాలెం వెళ్లే రహదారిపై రెండు అడుగులకు పైగా వరద చేరింది. ఈ మార్గంలోనే మూడు గ్రామాల ప్రజలు ప్రయాణిస్తున్నారు.పి.గన్నవరం మండలంలో లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది.
కె.ఏనుగుపల్లి, శివాయిలంక, జొన్నలంక, ఉడిమూడిలంక, చాకలిపాలెం శివారు కనకాయలంక తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రైతులకు చెందిన పశువుల పాకలు నీట మునిగాయి. రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో పశువులను, మేకలను కరకట్ట పైకి తీసుకు వచ్చారు. అక్కడే వాటిని కట్టుకొని సంరక్షించుకున్నారు. దీంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.




