Pithapuram: పిఠాపురంలో రేపు భారీ జాబ్ మేళా.. నిరుద్యోగ యువతకు సదవకాశం!
Pithapuram: పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సెప్టెంబర్ 6న పీడా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Pithapuram: పిఠాపురంలో రేపు భారీ జాబ్ మేళా.. నిరుద్యోగ యువతకు సదవకాశం!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు సంబంధిత శాఖల సమన్వయంతో రేపు (06-09-2026) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు PADA ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.
పిఠాపురంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9.00 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ కోరారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, రెజ్యూమ్ మరియు అవసరమైన ఇతర పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. అర్హత కలిగిన యువత ముందుగానే ఉద్యోగ అవకాశాలు, అర్హతలు తదితర వివరాలను తెలుసుకుని జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ సూచించారు.




