Kakinada: విరవ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0
Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే 4.0 ఘనంగా నిర్వహణ. హాజరైన 606 మంది.
Kakinada: విరవ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0
కాకినాడ: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గము... పిఠాపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విరవ లో మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జనార్దన్ రావు మాట్లాడుతూ March 2026 లో మా పాఠశాల నుండి పులపా లీల వెంకట దుర్గా కామేశ్వరి కి 590 మార్కులు వచ్చి మండలంలోని ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాం.
అలాగే త్రిబుల్ ఐటీ సీట్లు రెండు వచ్చాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి పాఠశాల డైరీ ని అందజేయడం జరిగింది అలాగే ఐడెంటి కార్డు కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజన పథకంలో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, తల్లితండ్రులు కమిటీ సభ్యులు విద్యార్థులు మొత్తం 606 మంది హాజరయ్యారు
Next Story




