Kakinada: కొత్తపల్లి మండలంలో కోతుల బెడదపై జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు

Kakinada: పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో కోతుల బెడద తీవ్రం కావడంతో సమస్య పరిష్కారం కోరుతూ అటవీశాఖ అధికారికి జనసేన నేతలు వినతిపత్రం అందజేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 10 Aug 2026 11:44 AM IST
Kakinada
X

Kakinada: కొత్తపల్లి మండలంలో కోతుల బెడదపై జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు

కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం....యు.కొత్తపల్లి మండలం: ఎండపల్లి, అమీనాబాద్ గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలపై దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో, సమస్యను పరిష్కరించేందుకు యు.కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ , గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్ జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు ని కలిసి సమస్యను వివరించారు.

గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, కోతుల దాడుల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వారు అధికారికి తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

కోతుల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, కోతులను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అటవీశాఖ అధికారిని కోరారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story