Pithapuram: మెప్మా ఆర్పీల సమీక్ష మన డబ్బులు మన లెక్కలు యాప్‌పై ఫోకస్!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం మెప్మా కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. శైలజ ఆధ్వర్యంలో ఆర్పీల సమీక్షా సమావేశం జరిగింది.

V. Ramakrishna, Pithapuram
Published on: 18 July 2026 1:53 PM IST
Pithapuram
X

Pithapuram: మెప్మా ఆర్పీల సమీక్ష మన డబ్బులు మన లెక్కలు యాప్‌పై ఫోకస్!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.....పిఠాపురం పురపాలక సంఘం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కాకినాడ జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.శైలజ మెప్మా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఆర్పీల సమీక్ష సమావేశంలో మొబైల్ బుక్ కీపింగ్, మన డబ్బులు మన లెక్కలు,జీవనో పాదులు యూనిట్లు , గుర్రపు డెక్కల యూనిట్ గురించి ఆర్పీలతో చర్చించడం జరిగింది.

ఈ సమావేశం లో మహిళలు మన డబ్బులు మన లెక్కలు యాప్ (MDML) పై అవగాహన పెంచుకోవాలని ఆ యాప్ లొ మహిళలు సంఘానికి చెల్లిస్తున్న పొదుపు, అప్పు పై చెల్లించిన వాయిదాలు , ఇతర వివరాలు మెప్మాకి సంబందించిన వివరాలు ఉంటాయని తెలుయపరిచారు. కార్యక్రమము 18 మరియు 20 తేదిలలో SLF లలో మీటింగ్ పెట్టి ర్యాలీలు చెయ్యాలని తెలియ చేశారు. మరియు గుర్రపు డెక్కలు తో నార తీసి ప్రోడక్ట్ తయరు చేయుట పై 2 నెలలు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి SHG మెంబర్స్ ని గుర్తించమని RP లకు తెలియపరచడమైనది.

ఈ కార్యక్రమంనకు జిల్లా జీవనోపాదుల స్పెషలిస్ట్ రవిశంకర్ , సిటీ మిషన్ మేనేజర్ కె. వెంకటలక్ష్మి , సీవోలు ఏ డి యం శైలజ,MD ఉమే సల్మా, డి.వీరలక్ష్మి ,ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలు , ఆర్పి పాల్గొనడం జరిగింది.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story