Pithapuram: పిఠాపురం జనసేన నేత కారే మహేష్ కుటుంబానికి రావు అక్షయ్ పరామర్శ!
Pithapuram: జనసేన నేత కారే మహేష్ కుటుంబ సభ్యులను ఉ. కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.
Pithapuram: పిఠాపురం జనసేన నేత కారే మహేష్ కుటుంబానికి రావు అక్షయ్ పరామర్శ!
పిఠాపురం: పొన్నాడ పంచాయతీ కోనపాపపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ 14వ వార్డు ఇంచార్జ్ దివంగత కారే మహేష్ పెద్దరోజు సందర్భంగా, ఉ. కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, జనసేన పార్టీ మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అలాగే రావు అక్షయ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పొన్నాడ గ్రామ పంచాయతీ జనసేన పార్టీ ఇంచార్జ్ పల్లేటి బాపన్న దొర, అమీనాబాద్ మాజీ సర్పంచ్ నక్క మణికంఠ, శ్రీరాంపురం జనసేన నాయకుడు పిర్ల శివాజీ , పొన్నాడ పంచాయతీ జనసేన నాయకులు,జనసైనికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




