Kakinada: ఎమ్మెల్యే మేనల్లుడిపై జనసేన నేత తీవ్ర ఆరోపణలు!

Kakinada: ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్లుడు బన్ను తమ స్థలాన్ని కబ్జా చేశారని, మత్స్యకారుల కులాన్ని కించపరిచారని జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆందోళన చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Aug 2026 5:06 PM IST
Kakinada
X

Kakinada: ఎమ్మెల్యే మేనల్లుడిపై జనసేన నేత తీవ్ర ఆరోపణలు!

కాకినాడ: కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం లో.. జనసేన పార్టీ చింతకాయల శ్రీను..స్థలం సంబందించిన విషయం లో.. ఎమ్ ఎల్ ఏ నానాజీ మేనల్లుడు.. బన్ను మరియు అనుచరులు దౌర్జన్యం..మరియు మత్స్య కారుల కులాన్ని కించపరిచాడు అంటూ ఆరోపణ ఎమ్ ఎల్ ఏ నానాజీ మేనల్లుడు బన్ను..మత్స్యకారుల కులాన్ని కించపరచడం వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను ఆధ్వర్యంలో మహిళలతో ఆందోళన.

జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను కామెంట్స్ జనసేన పార్టీ నాయకుడుని నేను నా స్థలం.. అందులో ఎమ్ ఎల్ ఏ నానాజీ మేనల్లుడు కబ్జా చెయ్యడం దారుణం ఈ విషయం చెప్పడానికి ఎన్నో సార్లు ఎమ్ ఎల్ ఏ నానాజీ గార్కి చెప్పడానికి వెళ్ళినా ఆయన అందుబాటులో లేరు. ఉన్నా నన్ను కలవడానికి ఇష్టపడలేదు. కోర్టులో ఉన్నా స్థలం విషయం లో సర్పవరం పోలీసులు అందులో సి. ఐ.. మా వారి పైన లాఠీ చార్జీ చేసారు. అనేక మందికి గాయాలు అయ్యాయి మా స్థలం విషయం లో.. మా పైన తప్పుడు కేసులు పెట్టాలి అని.. బన్ను పోలీసులు పైన ఒత్తిడి తీసుకోని వస్తున్నారు అని పోలీసులు చెప్పారు.

వాకలపూడి పంచాయతీ అధికారుల దగ్గర కి వెళ్ళితే.. మాకు రాజకీయ ఒత్తిడి ఎక్కువ అయ్యింది మేము ఏమి చేయ్యలేము అని చెప్పారు. జనసేన పార్టీ గెలుపు కోసం అందులో ఎటువంటి రాజకీయ లబ్ది ఆశించకుండా పనిచేసింది మత్స్యకారులు. అలాంటి కులాన్ని ఎమ్ ఎల్ ఏ నానాజీ మేనల్లుడు చులకన చేసి మాట్లాడం.. వలన రానున్న రోజుల్లో ఎమ్ ఎల్ ఏ పంతం నానాజీ గార్కి నష్టం అధికారంలోకి వఛ్చిన తరువాత ఒక్కసారి కూడ మా ప్రాంతంలో పర్యటించలేదు. ఎటువంటి అభివృద్ధి పనులు చెయ్యలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story