Pithapuram: వర్షానికి ఇల్లు కూలిన బాధితుడికి జనసేన ఆర్థిక సాయం!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం ముమ్మిడివారిపోడులో వర్షానికి ఇల్లు కూలిన పోతురాజుల సత్యనారాయణ కుటుంబానికి జనసేన నేత రావు అక్షయ్ రూ.12,000 ఆర్థిక సాయం అందించారు.
Pithapuram: వర్షానికి ఇల్లు కూలిన బాధితుడికి జనసేన ఆర్థిక సాయం!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గము శ్రీరాంపురం పంచాయతీ ముమ్మిడివారిపోడు గ్రామానికి చెందిన పోతురాజుల సత్యనారాయణ ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో, వారి కుటుంబాన్ని యు . కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది.
వారి పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని రావు అక్షయ్ హామీ ఇవ్వడం జరిగింది.
అలాగే స్థానిక జనసేన నాయకులు పిర్ల శివాజీ , పిర్ల రాము తో కలిసి కుటుంబానికి ₹12,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా కుటుంబ పరిస్థితి, వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల వైస్ ఇంచార్జ్ దొడ్డి దుర్గాప్రసాద్ ,శ్రీరాంపురం జనసేన ఇంచార్జ్ బండి రమణ మరియు గ్రామ జనసేన నాయకులు పాల్గొన్నారు




