Mamidada: భూమిపూజ చేసి నాగలి పట్టిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Mamidada: కాకినాడ జగ్గంపేట మండలం మామిడాడలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ భూమిపూజ చేసి, తొలి దుక్కి దున్ని ఏరువాక పనులను ప్రారంభించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 29 Jun 2026 4:11 PM IST
Mamidada
X

Mamidada: భూమిపూజ చేసి నాగలి పట్టిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Mamidada: జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఏరువాక ప్రారంభించి రైతులకు శుభాకాంక్షలు తెలిపిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రు, జిల్లా కలెక్టర్ హరేంద్రప్రసాద్ సోమవారం ఏరువాక ప్రారంభించారు.

ముందుగా భూమి పూజ చేసి అనంతరం నాగలితో దుక్కిదున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులకు మంచి శుభ పరిణామం అని జిల్లా కలెక్టర్ వారు విచ్చేసి ఏరువాక లో పాల్గొనడం అందరి అదృష్టం అన్నారు.

అలాగే రైతులు వరితోపాటు పామాయిల్ తోటలు ఎంతో లాభదాయకంగా ఉంటుందని అంతర్ పంటగా వివిధ పంటకాలు చేయవచ్చురన్నారు. రైతులు పాడి పశువులను కూడా పెంచడం ద్వారా లాభదాయకంగా ఉంటుందని గుర్తు చేశారు.

జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ

రైతులు వ్యవసాయ సాగు తో పాటు అంతర్భాగంగా పాడి పశువులను పెంచితే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రసాద్ హార్టికల్చర్ ద్వారా పామాయిల్ పెంపకం లావదాయకం. బ్యాంక్ కేసు ద్వారా కానీ, శ్రీనిధి ద్వారా కానీ అర్హులైన లబ్ధిదారులకు పాశువులను అందిస్తాం. హరేంద్ర ప్రసాద్.

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మే నెలలో గోదావరి జలాలు విడుదల చేయడం జరిగిందని ఆ ప్రాంత వాసులు వరి నాట్లు నాటే పనిలో ఉన్నారన్నారు. అలాగే ఈ మెట్ట ప్రాంతంలో పుష్కరిస్తే పూతల పథకానికి 52 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరితగతిన పనులు పూర్తిచేసి పూర్తి స్థాయి సాగునీరు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు మహిళలు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story