Jaggampeta: జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Jaggampeta: శ్రావణ శుక్రవారం సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇర్రిపాకలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 28 Aug 2026 7:56 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

జగ్గంపేట: శ్రావణ శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని శివ కేశవుల క్షేత్రంలో ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతుల ఆధ్వర్యంలో ఇర్రిపాక మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు పద్మావతి దేవి గంగారత్నం దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలిత కంబాల శ్రీనివాసరావు దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు.

శివ కేశవులను దర్శించుకుని అనంతరం వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతుల నెహ్రూ, కంబాల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్న ఇర్రిపాక శివ కేశవుల ఆలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆహ్వాన మేరకు ఇర్రిపాక గ్రామంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు కుటుంబ సమేతంగా హాజరు కావడం జరిగిందన్నారు.

శ్రావణ శుక్రవారం రోజు వ్రతాలు నిర్వహిస్తున్న మహిళలకు తన వంతుగా బంగారు రూపులు, పట్టుచీరలు ఉచితంగా అందించాలని సంకల్పించడం జరిగిందన్నారు. హిందూధర్మ పరిరక్షణ, మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో శ్రావణమాసంలో మహిళలకు పట్టు చీరలు బంగారు రూపులు, ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

మన సంస్కృతి, సాంప్రదాయాలు, చాలా గొప్పవని, వాటిని ప్రతి ఒక్కరు ఆచరించాలన్నారు. మన దేశం విశ్వగురువు అన్నారు. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో నూతన, శిథిలావస్థ, ఆలయాల అభివృద్ధికి, విద్యా, వైద్య, ఆర్థిక పరంగా కోట్ల రూపాయలు, సొంత నిధులు ఖర్చు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కంబాల శ్రీనివాసరావు సేవలు మరువలేనివని, హిందూ ధర్మ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఇర్రి పాక శివ కేశవుల పుణ్యక్షేత్రం నిరంతరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాలని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్షేత్రంలో సెప్టెంబర్ 4వ తేదీన అష్టలక్ష్మి గుడికి నా చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని 5వ తేదీ రామాలయం శంకుస్థాపనకు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించిన, 200 మంది మహిళలకు వరలక్ష్మి బంగారు రూపు, పట్టుచీర, పసుపు కుంకుమలను, జ్యోతుల నెహ్రూ మణి, కంబాల శ్రీనివాసరావుపద్మావతి దేవి గంగారత్నం దంపతులు పంపిణీ చేసారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story