Tuni: తునిలో దంచికొట్టిన భారీ వర్షం జలమయమైన రోడ్లు!
Tuni: కాకినాడ జిల్లా తునిలో దంచికొట్టిన భారీ వర్షం జలమయమైన ప్రధాన రహదారులు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.
Tuni: తునిలో దంచికొట్టిన భారీ వర్షం జలమయమైన రోడ్లు!
Tuni: ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన తుని ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం లభించినప్పటికీ, ఆ వెంటనే కురిసిన భారీ వర్షం . సుమారు గంటపాటు దంచికొట్టిన వర్షానికి పొంగిపొర్లిన డ్రైనేజీలు.. జలమయమైన రోడ్లు.
భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు అన్నీ నదులను తలపించాయి. మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడంతో డ్రైనేజీలు పూర్తిగా పొంగిపొర్లాయి.
వాహనదారులు, పాదచారులు రోడ్లపై భారీగా నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసులు, పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నీటిలో చిక్కుకుని నానా తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వర్షాకాలం ముందస్తు చర్యలు సరిగ్గా చేపట్టకపోవడం వల్లే డ్రైనేజీలు పొంగిపొర్లాయని స్థానికులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక (మున్సిపల్) అధికారులు స్పందించి, పూడికతీత పనులు వేగవంతం చేయాలని, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.




