Mummidivaram: ముమ్మిడివరంలో ఎడతెరిపి లేని వాన ఉక్కపోత నుంచి ఉపశమనం!

Mummidivaram: డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేని వర్షం.. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు, రైతులు హర్షం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2026 10:43 AM IST
Mummidivaram
X

Mummidivaram: ముమ్మిడివరంలో ఎడతెరిపి లేని వాన ఉక్కపోత నుంచి ఉపశమనం!

Mummidivaram: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన ముమ్మిడివరం ఐ.పోలవరం మండలాలలో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొద్దిరోజులుగా మితిమీరిన ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.

వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన ప్రజలు వర్షం కోసం ఎదురు చూశారు.

ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జనజీవనంపై కొంత ప్రభావం కనిపించింది. మరోవైపు వర్షం రైతులకు కూడా ఎంతో ఊరటనిచ్చింది.

చాలా రోజుల తర్వాత సమృద్ధిగా వర్షం కురవడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్