Pithapuram: పిఠాపురం శ్రీపాద వల్లభ ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు!

Pithapuram: పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి ఏపీ మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

RAMA KRISHNA, KKD
Published on: 29 July 2026 2:40 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం శ్రీపాద వల్లభ ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు!

కాకినాడ జిల్లా... పిఠాపురం నియోజకవర్గం:

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. గురు పౌర్ణమి

పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామి వారికి దివ్య అలంకరణ చేసి కాకడ హారతి, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం పిఠాపురం, మహరాష్ట్ర మరియు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ పాద వల్లభ మహాసంస్థానంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో నిర్వహించారు.

ఆలయ ప్రాంగణం శ్రీపాద వల్లభని నామస్మరణతో మారుమోగగా, భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో గురుపౌర్ణమి వేడుకలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు.

దర్శనానికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ తగు జాగ్రత్తలు నిర్వహించారు. అనంతరం

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story