Samarlakota: సామర్లకోటలో వైభవంగా శ్రీ పాండురంగ స్వామి దివ్య కల్యాణం!
Samarlakota: తొలి ఏకాదశి సందర్భంగా సామర్లకోటలో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామి దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
Samarlakota: సామర్లకోటలో వైభవంగా శ్రీ పాండురంగ స్వామి దివ్య కల్యాణం!
Samarlakota: తొలి ఏకాదశి సందర్భంగా సామర్లకోట శివారు ప్రసన్నాంజనేయ స్వామి శాఖ సమీపాన గల రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపాండురంగ స్వామి ఆలయంలో స్వామి వారి అమ్మవారి దివ్య కళ్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయ ఛైర్మన్ అయోధ్యల రాజేశ్, వేద పండితులు సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కళ్యాణ వేడుకలను నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేడుకకు సామర్లకోట,పెద్దాపురం పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సిబ్బంది భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. తెల్లవారు జాము నుండి ఆలయానికి భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.
Next Story




