Gollaprolu: గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివిజ సంపతి
Gollaprolu: గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ దివిజ సంపతి, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Gollaprolu: గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివిజ సంపతి
గొల్లప్రోలు: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివిజ సంపతి మర్యాదపూర్వకంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబును ని కలిసారు.
కడప జిల్లాలో మండల అభివృద్ధి అధికారిణి (ఎండీఓ)గా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పదోన్నతిపై కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులై ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దివిజ సంపతి , కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దివిజ సంపతి తుమ్మల రామస్వామి బాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గొల్లప్రోలు మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన పౌర సేవల అందజేతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటి పరిష్కారానికి చొరవ చూపుతూ పారదర్శకమైన, ప్రజాహిత పరిపాలన అందించాలని సూచించారు.
గొల్లప్రోలు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
అనంతరం దివిజ సంపతి మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన సేవలు అందించడంతో పాటు, మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన చర్యలను చేపడతానని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో గొల్లప్రోలు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.




