Gandepalli: 10.3 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్

Gandepalli: గండేపల్లి వద్ద ఎన్‌హెచ్-16 సమీపంలో 10.356 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. కర్ణాటకకు చెందిన నిందితుడు సహా ఇద్దరి అరెస్ట్.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 10 Sept 2026 7:49 PM IST
Gandepalli
X

Gandepalli: 10.3 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్

గండేపల్లి: కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ జి. బిందు మాధవ్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిలక్ పెద్దాపురం ఉపవిభాగ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జగ్గంపేట సి ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా నిర్మూలన బృందం, గండేపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 10.356 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సెప్టెంబర్‌ 10న గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ యు.వి. శ్రీనాగబాబు ఆధ్వర్యంలో గంజాయి నిరోధక బృందం, పెద్దాపురం ఎస్‌ఐ గల్లా అనుమాలో ఒక గెడిట్‌ అధికారి, సిబ్బందితో కలిసి గండేపల్లి మండలం, ఎన్‌హెచ్‌-16 సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం సుమారు 10 గంటల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 10.356 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

అరెస్టయిన నిందితులను అజయ్ కుమార్, తండ్రి అజయ్ రాము, వయస్సు 25 సంవత్సరాలు, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడి వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు.

పోలీసుల విచారణలో నిందితులు రెండు బ్యాగుల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడైంది. గంజాయి నిరోధక బృందం తనిఖీల్లో మొత్తం 13 ప్యాకెట్లలో 10.356 కిలోల గంజాయి లభించింది.

స్వాధీనం చేసుకున్న గంజాయిలో ఒక బ్యాగులో 11 ప్యాకెట్లలో 8.266 కిలోలు, మరో బ్యాగులో 2 ప్యాకెట్లలో 2.090 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐఫోన్‌-14 అనే రెండు మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు బెంగుళూరు నుంచి విశాఖపట్నం వరకు గంజాయిని తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ ఘటనపై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (ఎన్‌డీపీఎస్‌ చట్టం), 1985లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story