Kumarapuram: బి.ఆర్.సి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Kumarapuram: పిఠాపురం మండలం కుమారపురంలో బిఆర్‌సి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది.
Kumarapuram: బి.ఆర్.సి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Kumarapuram: పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో బి.ఆర్.సి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్లోబల్ హాస్పిటల్ మరియు టీం హాస్పిటల్ అనుసంధానంతో , బొంగరాల రవిచంద్రన్ నిర్వహణలో ఉచిత మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై క్యాంపును సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు చిక్కల వరలక్ష్మి కూడా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహాలు మరియు అవసరమైన మందులను పొందారు.
ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు. పిఠాపురం ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి రావడం వల్ల అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. సేవా భావంతో సమాజానికి అండగా నిలుస్తున్న బి.ఆర్.సి చారిటబుల్ ట్రస్ట్, బొంగరాల రవిచంద్రన్ మరియు వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుమార్ పురం గ్రామ జనసేన పార్టీ ఇంచార్జి ప్రభు, రావుల రమణారావు, ఆగంటి ప్రభాకర్,స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.




