Pithapuram: ముమ్మిడివారిపోడులో మెడికవర్ ఆసుపత్రి సహకారంతో హెల్త్ క్యాంప్!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం ముమ్మిడివారిపోడు గ్రామంలో జనసేన నాయకుడు పీర్ల శివాజీ ఆధ్వర్యంలో, మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 9 Aug 2026 5:20 PM IST
Pithapuram
X

Pithapuram: ముమ్మిడివారిపోడులో మెడికవర్ ఆసుపత్రి సహకారంతో హెల్త్ క్యాంప్!

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలోని ముమ్మిడివారిపోడు గ్రామంలో జనసేన నాయకులు పీర్ల శివాజీ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ విచ్చేసి, ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఉచితంగా ఈసీజీ షుగరు బిపి కంటికి మరియు పంటికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందుల ఇవ్వబడడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాంపురం మాజీ సర్పంచ్ రావి రమేష్,అమీనాబాద్ మాజీ సర్పంచ్ నక్క మణికంఠ, డాక్టర్లు మెడికవర్ హాస్పిటల్ అంజిబాబు, కార్డియాలజీ డా చెన్నకేశవరావు, గైనకాలజీ డా లక్ష్మీ ప్రవీణ, శ్రీరాంపురం జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story