Pithapuram: చిత్రాడ జడ్పీ పాఠశాలలో పదో తరగతి ప్రతిభావంతులకు ఘన సత్కారం
Pithapuram: జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్‌లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను శ్రీ రామనామ ప్రచార సంస్థ, పెరాట్ల సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కరించారు.
Pithapuram: చిత్రాడ జడ్పీ పాఠశాలలో పదో తరగతి ప్రతిభావంతులకు ఘన సత్కారం
పిఠాపురం: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ రామనామ ప్రచార సంస్థ, పెరాట్ల సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు.
2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, షీల్డ్‌లు, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. అలాగే ప్రథమ స్థానం సాధించిన బాలుడు, బాలికలకు నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి పిరాట్ల వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ, తనికెళ్ల విజయ రాఘవమూర్తి అధ్యక్షతన నిర్వహిస్తున్న శ్రీ రామనామ ప్రచార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక, ధార్మిక, విద్యా సేవా కార్యక్రమాల్లో భాగంగా చిత్రాడ జడ్పీ హైస్కూల్లో గత 18 సంవత్సరాలుగా ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా 500కు పైగా మార్కులు సాధించే విద్యార్థులందరికీ ప్రోత్సాహక పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.
కార్యక్రమానికి డిప్యూటీ ఈవో కె.వి.వి. సత్యనారాయణ అధ్యక్షత వహించగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. వసంత కుమారి, ఉపాధ్యాయ సిబ్బంది, శ్రీ రామనామ ప్రచార సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పి. లక్ష్మి అరుణ, గ్రామ పెద్దలు రావు వెంకట మహేశ్వరరావు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.




