Pithapuram: పిఠాపురం జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

Pithapuram: పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. ప్రభుత్వ స్కూల్‌లో MPTM 3.1 మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ విజయవంతమైంది.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 July 2026 5:33 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

Pithapuram: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నేడు పిఠాపురం పట్టణంలోని ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో నిర్వహించిన MPTM 3.1 (మెగా పేరెంట్–టీచర్ మీటింగ్) కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ పర్యవేక్షణ కమిటీ సభ్యులు, పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై విద్య ప్రాధాన్యత, విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధిపై అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ

పెండెం దొరబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. "విద్యార్థుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది" అనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story