Kothapalli: చెరువులో చేపల మృతిపై జేఈ వివరణ.. నీటి శుద్ధిపై క్లారిటీ
Kothapalli: కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం సూరప్ప చెరువులో చేపలు చనిపోవడంపై జేఈ రమణ వివరణ ఇచ్చారు.
Kothapalli: చెరువులో చేపల మృతిపై జేఈ వివరణ.. నీటి శుద్ధిపై క్లారిటీ
Kothapalli: కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై వివరణ ఇచ్చిన జేఈ రమణ. జేఈ రమణ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ఆక్సిజన్ తక్కువ ఉండడం వలన నీటిలో ఉన్న తక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరిగిందని వాటిని వెంటనే తీయించి అదంతా పరిశుభ్రం చేయడం జరిగింది అన్నారు.
చెరువులను నీటిని శాంపిల్ కాకినాడ ల్యాబ్ కు పంపడం జరిగిందని, అలాగే ఆక్సిజన్ లెవెల్ పెంచడం కూడా జరుగుతుందని, అలాగే ఉన్న చేపలను చనిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులతో చర్చించడం జరుగుతుందని అన్నారు.
చెరువులోని నీటిని ప్రజలకు డైరెక్ట్ గా ఇవ్వడం జరగదని, శుద్ధిచేసి పరీక్షించిన తర్వాతే ఆ నీటిని అందిస్తున్నామని, ఎవరికైనా అనుమానం ఉన్నచో మమ్మల్ని సంప్రదిస్తే మేము దాన్ని పూర్తిగా పరీక్షించి మేము త్రాగి చూపించిన తర్వాత ప్రజలకు అందివ్వడం జరుగుతుందని అన్నారు.
ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఎటువంటి అనుమానం ఉన్న మమ్మల్ని సంప్రదిస్తే మేము కచ్చితంగా పరీక్ష చేసి ఖచ్చితమైన మంచినీటినందిస్తామని తెలియజేశారు.




