Pithapuram: పిఠాపురంలో ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలు

Pithapuram: పిఠాపురం బైపాస్‌లో ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

V. Ramakrishna, Pithapuram
Published on: 25 July 2026 4:59 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలు

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.. ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి

ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం బైపాస్‌లోని ఏకలవ్య మహారాజ్ విగ్రహం వద్ద బాల వినాయక ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్యుడి సేవలను, త్యాగాన్ని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి తదితరులు కూడా ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి (బాబు) మాట్లాడుతూ, విలువిద్యలో ఏకలవ్యుడు సాధించిన ప్రావీణ్యం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. గురుభక్తికి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఏకలవ్యుడు, తన గురువు ద్రోణాచార్యుడికి ఇచ్చిన మాట కోసం తన బొటనవేలిని గురుదక్షిణగా సమర్పించడం అపూర్వమైన త్యాగమని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు అంకితభావం, పట్టుదల, వినయం వంటి విలువలను నేర్పిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ సమాజంలోని అన్ని వర్గాలను సమాన దృష్టితో ఆదరిస్తూ, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడని తుమ్మల బాబు అన్నారు. ఏకలవ్యుడు సమానత్వానికి ప్రతీకగా నిలిచినట్లే, పవన్ కళ్యాణ్ కూడా కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానంలాజర్ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ మోకాపల్లి దేవి సూర్య ప్రకాష్, బొజ్జ లోవరాజు, బొజ్జ కుమార్, పోలిశెట్టి చంద్ర శేఖర్, రావుల రమణారావు, వెన్న చందర్రావు, కుక్కల నాగమణి,,బాల వినాయక ఎరుకల సంఘం సభ్యులు బి రామచంద్రయ్య, బి నాగేశ్వరరావు , జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏకలవ్య మహారాజ్‌కు ఘన నివాళులు అర్పించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story