Tuni: ప్రమాదకరంగా మారిన పురాతన గోడ, రావి చెట్టు పట్టించుకోని అధికారులు!

Tuni: తుని దివానపు వీధిలో ప్రమాదకరంగా మారిన పురాతన గోడ, రావి చెట్టుపై కథనాలు వచ్చినా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

MANIKANTA, TUNI
Published on: 5 Aug 2026 8:41 AM IST
Tuni
X

Tuni: ప్రమాదకరంగా మారిన పురాతన గోడ, రావి చెట్టు పట్టించుకోని అధికారులు!

Tuni: కాకినాడ జిల్లా తుని పట్టణంలోని దివానపు వీధి నుంచి గౌరీదేవి గుడి వీధికి వెళ్లే సందులో ఉన్న ప్రమాదకర పురాతన గోడ మరియు రావి చెట్టు ఉదంతంపై మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చినప్పటికీ, సంబంధిత అధికారుల్లో కనీస చలనం రాలేదు. ప్రాణాపాయం పొంచి ఉందని స్థానికులు మొరపెట్టుకుంటున్నా, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండటాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​ప్రతిరోజూ గర్ల్స్ హైస్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, విద్యార్థినులు, వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ మార్గంలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోడ మరింత నానిపోయి ఏ క్షణాన కూలుతుందో, పక్కనే ఉన్న విద్యుత్ తీగలు ఎవరి ప్రాణాలు తీస్తాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

​ఇప్పటికైనా ఉన్నత అధికారులు, మున్సిపల్ యంత్రాంగం తక్షణమే స్పందించి... బాధ్యత లేని యజమానులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరంగా ఉన్న ఆ పురాతన గోడను, రావి చెట్టును వెంటనే తొలగించి ప్రాణనష్టం జరగకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story