Kakinada: ఏబీఎన్ ఎండీని అరెస్ట్ చేయాలి పెద్దాపురం పోలీసులకు వైసీపీ వినతి

Kakinada: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్దాపురంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 1:25 PM IST
Kakinada
X

Kakinada: ఏబీఎన్ ఎండీని అరెస్ట్ చేయాలి పెద్దాపురం పోలీసులకు వైసీపీ వినతి

కాకినాడ జిల్లా: ABN రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దవ్వులూరి దొరబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

దవులూరి దొరబాబు మాట్లాడుతూ ఏప్రిల్ 4 న ABN ఆంధ్రజ్యోతి ఛానల్ లో ప్రచారమైన ఒక కార్యక్రమం లో ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ ఆ ప్రసారంలో వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని మహిళలను కించపరిస్తూ అనేక రకమైన వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రాధాకృష్ణ పైన యాంకర్ పైన ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ మీద సమగ్రహణ విచారణ చేసి వారిని శిక్షించాలని ఆరోజు ప్రచారమైన కార్యక్రమాలను ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని కంటైనను తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్దాపురం పట్టణ సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రాధాకృష్ణ గారికి బూతు కిట్టు అనే పేరు కూడా ఉంది ఆ పేరును సార్ధకం చేసుకుంటున్నారు అన్నారు.

ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా ఒక అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలి అనే కార్యక్రమంలో ఆయన ఉండగా కానీ జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే అలాగే మచిలీపట్నం విజయనగరం గుంటూరు కూడా అమరావతికి వ్యతిరేకం కాకుండా ఈ ప్రాంతంలో కూడా రాజధాని చేయాలని అడిగితే ప్రజలందరూ దానికి సానుకూలంగా స్పందిస్తుంటే ఆ స్పందన చూసి ఈరోజు అనేక ఎల్లో మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పై అనేక ఆరోపణ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులను పిచ్చి సమూహాలు వెన్నుముకలేని బ్యాచ్ ఇక్కడున్నటువంటి మహిళను కూడా కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మహిళలకు బహిరంగ క్షమాపణ ంగా చెప్పాలని అలాగే పోలీస్ కూడా దీనిపై సమగ్రహణ విచారం చేపట్టి రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని అన్ని సోషల్ మీడియా నుంచి ఆ కార్యక్రమాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతిపత్రం అందజేసిన పెద్దాపురం వైసిపి ఇన్చార్జ్ దవులూరి దొరబాబు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story