Tuni: కుండపోత వర్షంలో అదుపుతప్పిన కారు..

Tuni: తుని మండలం ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

MANIKANTA, TUNI
Published on: 27 Jun 2026 1:38 PM IST
Tuni
X

Tuni: కుండపోత వర్షంలో అదుపుతప్పిన కారు..

తుని: తుని మండలం ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్న కారు, ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం.

​ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో రహదారిపై వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.

అయితే, కారు బోల్తా పడినప్పటికీ, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story