Mummidivaram: కోనసీమ జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దాలి!
Mummidivaram: ముమ్మిడివరంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు.. జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దాలని అధికారుల పిలుపు.
Mummidivaram: కోనసీమ జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దాలి!
Mummidivaram: బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి బాలికలకు విద్య, భద్రత, ఆరోగ్యంతో కూడిన భవిష్యత్తును అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలెర్ట్ ఎన్ జి ఓ. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జె ఆర్ సి ) ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, హక్కులపై కలిగే నష్టాలను వివరించారు.
బాల్య వివాహాల నివారణలో ఐసీడీస్ , పోలీస్, విద్యాశాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, డీసీపీయూ , పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాల్య వివాహాలపై అనుమానం వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు సూచించారు.
“బాల్య వివాహాలకు ముగింపు – బాలికల విద్యకు ప్రాధాన్యం” అనే నినాదంతో జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ముమ్మిడివరం ఎస్‌ఐ డి. శివకృష్ణ, అలెర్ట్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఐసీడీస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎమ్ లు, ఉపాధ్యాయులు, ఎన్ జి ఓ ప్రతినిధులు పాల్గొన్నారు.




